SRIVARI PADALU REACHES TIRUCHANOOR _ వైభవంగా శ్రీవారి పాదాల‌ ఊరేగింపు

Tiruchanoor, 28 Nov. 19: The divine Srivari Padalu has reached Tiruchanoor on Thursday. 

In a grand procession, the padalu reached Pasupu Mandapam at Tiruchanoor via Komalamma Satram and other important streets in Tirupati from Alipiri. 

These padalu were received by Temple DyEO Sri C Govindarajan,  Superintendent Sri Gopalakrishna Reddy and other priests amidst chanting of Vedic mantras. 

These padalu will be decked to Goddess Sri Padmavathi Devi during Garuda Vahana Seva on Thursday evening. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వైభవంగా శ్రీవారి పాదాల‌ ఊరేగింపు

తిరుపతి, 2019 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం  రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల‌ ఊరేగింపు వైభవంగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాల‌ను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వ‌స్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాల‌ను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు, అర్చ‌కులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.