DARSHAN RESUMES AT TIRUMALA TEMPLE FOR PILGRIMS AFTER 82 DAYS _ శ్రీ‌వారి ఆల‌యంలో 82 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం పునఃప్రారంభం

PILGRIMS EXPRESS IMMENSE SATISFACTION OVER THE ARRANGEMENTS

LAUDABLE EFFORTS BY OFFICIALS IN MAKING ARRANGEMENTS-CHAIRMAN

Tirumala, 11 Jun. 20: The joy of devotees knew know bounds, when they had a leisurely darshan of Lord Venkateswara in Tirumala temple on Thursday. TTD resumed darshan of Sri Venkateswara Swamy after 82 days.

“My life sanctified today. I never had such a peaceful darshan in the last two decades. That is the grace of Perumal. Though He put all of us on litmus test by not giving darshan for over 80 days, the darshan I had today was never before. Kudos to the arrangements made by TTD management. Starting from Alipiri checking point, Kalyanakatta, Reception, entering into the queue lines, inside the sanctum sanctorum, Annaprasadam Complex, Laddu Counters, TTD took all precautions and followed COVID guidelines.  It is now the turn of all of us (pilgrims) to cooperate with the management and ensure following all the guidelines to have hassle free darshan”, said an elated Saravana Babu from Tamilnadu.

Smt. Lakshmi from Sunnapuveedhi in Tirupati busted out in tears of joy saying that, “I am a resident of Tirupati and I often come for darshan of lord. In all these years, I never had the experience to have His darshan this peaceful. I took the free darshan token along with my husband yesterday at Tirupati. Thanks to TTD for the impeccable arrangements”, she said.

Meanwhile, TTD Chairman Sri YV Subba Reddy lauded the efforts of TTD mandarins in making the arrangements for the pilgrims. Our officials worked day and night to come out with a pucca plan and executed it with perfection with the team work of all departments both at Tirumala and in Tirupati”, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో 82 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం పునఃప్రారంభం

టిటిడి ఏర్పాట్ల‌పై పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేసిన భ‌క్తులు
అధికారుల కృషి అభినంద‌నీయం : టిటిడి ఛైర్మ‌న్‌
8 రాష్ట్రాల నుండి భ‌క్తులు రాక‌

తిరుమ‌ల‌, 2020 జూన్ 11: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో 82 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు ద‌‌ర్శ‌నం పునఃప్రారంభ‌మైంది. స్వామివారిని సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకోవ‌డంతో భ‌క్తుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.‌సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌-19 నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌లు పాటిస్తూ టిటిడి అధికారులు తిరుప‌తి, తిరుమ‌ల‌లో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టార‌ని తెలిపారు. అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ప‌క్కా ప్ర‌ణాళికతో ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశార‌ని అభినందించారు.

కాగా, గురువారం నాడు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శించుకున్న భ‌క్తుల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన వివ‌రాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ నుండి 143, త‌మిళ‌నాడు నుండి 141, క‌ర్ణాట‌క నుండి 151 మందితోపాటు మ‌హారాష్ట్ర‌, న్యూఢిల్లీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ‌బెంగాళ్‌ ప్రాంతాల నుండి భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు భ‌క్తుల‌ను ప‌ల‌క‌రించ‌గా ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ శ‌ర‌వ‌ణ‌బాబు మాట్లాడుతూ ” ఈరోజు నా జీవితం ధ‌న్య‌మైంది. గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఇంత‌టి ప్ర‌శాంత‌మైన ద‌ర్శ‌నం ఎప్పుడూ చేసుకోలేదు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. 80 రోజులు ద‌ర్శ‌న‌మివ్వ‌కుండా స్వామివారు మ‌న ఓర్పును ప‌రీక్షించారు. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి ద‌ర్శ‌నం కాలేదు. అలిపిరి చెక్‌పాయింట్‌, క‌ల్యాణ‌క‌ట్ట‌, గ‌దులు, క్యూలైన్లు, శ్రీ‌వారి ఆల‌యం, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, ల‌డ్డూ కౌంట‌ర్లు త‌దిత‌ర ప్రాంతాల్లో కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న టిటిడి అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ నిబంధ‌న‌ల‌న్నీ పాటించి టిటిడికి స‌హ‌క‌రించ‌డం భ‌క్తులుగా మా బాధ్య‌త‌”.

తిరుప‌తిలోని సున్న‌పువీధికి చెందిన శ్రీ‌మ‌తి ల‌క్ష్మీని ప‌ల‌క‌రించ‌గా ఆనంద‌భాష్పాలు రాల్చారు. “నేను తిరుప‌తిలో ఉంటూ త‌ర‌చూ ద‌ర్శ‌నానికి వ‌స్తుంటాను. ఇన్ని సంవ‌త్స‌రాల్లో ఇంత ప్ర‌శాంతంగా ఎప్పుడూ ద‌ర్శ‌నం చేసుకోలేదు. నా భ‌ర్త‌తో క‌లిసి బుధ‌వారం తిరుప‌తిలో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు పొందాను. చ‌క్క‌టి ఏర్పాట్లు చేప‌ట్టిన టిటిడికి కృత‌జ్ఞ‌త‌లు.”

భక్తుల సహకారం భేష్‌

ద‌ర్శనాల సంఖ్య పెంచడానికి తొందరపడం :  టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

అన్నదానం, కళ్యాణకట్టలో ఆకస్మిక తనిఖీలు

కరోనా వ్యాప్తి నివారణ కోసం టీటీడీ  అమలుచేస్తున్న ముందుజాగ్రత్త చర్యలకు భక్తుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు  ధరించి, సానిటైజ్ చేసుకుంటూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు.

గురువారం నుంచి తిరుమలలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభించిన నేపథ్యంలో భక్తులకు అందుతున్న సేవలు, పాటిస్తున్న జాగ్రత్తలు తెలుసుకోవడానికి చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్నదానం కాంప్లెక్స్ వంటశాలను పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు కాలితో నొక్కే కుళాయిలను చూశారు. రెండురోజుల క్రితం ఈ కుళాయిలు ఏర్పాటు చేయాలని చైర్మన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

కళ్యాణకట్టలో తలనీలాల సమర్పణ జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. క్షురకులకు పీపీ ఈ కిట్లు ధరించడంలో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవకాశాన్ని బట్టి దర్శనం టికెట్ల సంఖ్య పెంచుతామని, అయితే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమన్నారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 చైర్మన్ వెంట టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, డిప్యూటి ఈఓ శ్రీ సెల్వం త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది