OFFLINE TOKEN HOLDERS TO REPORT ONLY DURING ALLOTTED TIME SLOT _ ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భ‌క్తులను నిర్దేశిత తేదీల్లోనే అనుమ‌తి

Tirumala, 11 Jun. 20: TTD has appealed to devotees who booked Time slot free tokens in offline at Tirupati to report at Tirumala only during allotted time to avoid congregation. 

In a statement on Thursday evening, TTD cleared devotees will not be allowed for darshan other than their given time slot. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భ‌క్తులను నిర్దేశిత తేదీల్లోనే అనుమ‌తి

తిరుమ‌ల‌, 2020 జూన్ 11: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో ఉచితంగా టోకెన్లు పొందిన భ‌క్తులు నిర్దేశిత తేదీల్లోనే ద‌ర్శ‌నానికి రావాల‌ని, లేనిపక్షంలో అనుమ‌తించేది లేద‌ని టిటిడి గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అదేవిధంగా, టికెట్ గ‌ల భ‌క్తులు మాత్ర‌మే ద‌ర్శ‌నానికి రావాల‌ని, ఒక‌రి టికెట్‌పై మ‌రొక‌రు రాకూడ‌ద‌ని తెలియ‌జేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టిటిడి కోరింది. అదేవిధంగా, కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.