ముగిసిన శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు

ముగిసిన శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు

ఆగస్టు 03, తిరుమల 2018: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని కళ్యాణవేదికలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ భజన మండళ్ల సభ్యులు శ్రీ జయతీర్థులవారి సాహిత్యాన్ని, పురందరదాసులవారి కీర్తనలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఆయా గ్రామాల్లో ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం భజన మండళ్లను బలోపేతం చేసేందుకు సభ్యుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.

కాగా, భజన మండళ్ల సభ్యులు సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మూడు వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.