APPALAYAGUNTA BALALAYAM FROM AUGUST 4 TO 6_ ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ

Tirupati, 3 August 2018: Astabandhana Balalaya Maha Samprokshanam in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed from August 4 to 6.

On Saturday evening Ankurarpanam will be performed while on August 5 Jaladhivasa Shanti Homam and on August 6 Purnahuti will be performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2018 ఆగస్టు 03: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఆగస్టు 4వ తేదీ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఆగస్టు 5న ఉదయం వాస్తుశుద్ధి, జలాధివాస శుద్ధి చేస్తారు. సాయంత్రం మహాశాంతి జాప్యం, మహాశాంతి తిరుమంజనం, రక్షాబంధనం, శయనాధివాసం, సర్వదేవతార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, కుంభ బింబ ప్రదక్షిణ, ఉదయం 9.50 నుండి 10.30 గంటల మధ్య కన్యా లగ్నంలో బాలాలయ కుంభాబిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోపణ, బ్రహ్మ ఘోష చేపట్టనున్నారు. అనంతరం భక్తులను ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు బాలాలయంలో స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.