GUIDANCE OF GURUS IS IMPORTANT FOR SALVATION- HH SRI SUGUNENDRATHEERTHA_ గురువుల మార్గ‌ద‌ర్శ‌నంతో సుల‌భంగా శ్రీ‌వారి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు : శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ

Tirumala, 20 Jul. 19: The guidance of teachers (Gurus) was essential to lead life in correct path and to attain divinr bliss said the pontiff of Puttige Mutt of Udupi, HH Sri Sugunendrathirtha Swami.

Speaking at the Sri Jayathirtha Anardhana organised by the TTDs Dasa Sahitya Project in the Asthana Mandapam on Saturday at Tirumala, the pontiff said Sri Jayathirtha had composed the epic, Nyaya Sudha that heralded the basic tenets of dharma for attaining moksha, the eternal bliss.

Nearly 2500 bhajan mandals hailing from AP, Telangana, Karnataka and Tamil Nadu participated in the program conducted under ageis of Dasa Sahitya Project of TTD in the supervision of Dr PR Anandathirthacharyulu, the Special Officer of the Project.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గురువుల మార్గ‌ద‌ర్శ‌నంతో సుల‌భంగా శ్రీ‌వారి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు : శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ

తిరుమల, 2019 జూలై 20: క‌లియుగంలో ప్ర‌తి ఒక్క‌రు గురువుల మార్గ‌ద‌ర్శ‌నంతో సుల‌భంగా శ్రీ‌వారి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చ‌న్నిఉడిపిలోని పుత్తిగె మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు శ‌నివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ మంగళశాసనాలు చేస్తూ శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు స‌మాజానికి ‘న్యాయసుధ’ గ్రంథాన్ని అందించి ద‌శ – దిశ నిర్ధేశించార‌న్నారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రసన్నమూర్తి అయిన శ్రీవారిని సేవిస్తే ముక్తి సిద్ధిస్తుంద‌న్నారు. అనంత‌రం వాలీ – సుగ్రీవుడు – హ‌నుమంతుడి క‌థ‌ను వివ‌రించారు.

ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక సంకీర్తనాలాపన, సంగీత విభావరి చేపట్టారు. కొక్కెకి చెందిన సుబ్రహ్మణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ, జూలై 22న బెంగళూరుకు చెందిన శ్రీ రాఘ‌వేంద్ర‌స్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 2,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.