DASA ARADHANA MAHOTSAV CONCLUDED AT TIRUMALA _ ముగిసిన శ్రీ వ్యాసరాజ తీర్థులు, శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు
DASA ARADHANA MAHOTSAV CONCLUDED AT TIRUMALA
Tirumala,22, March 2022: The three day long Dasa Aradhana Mahotsav of Sri Vyasaraja Thirtha and his disciple Sri Vadiraja Thirtha grandly organised by TTD at the Asthana mandapam concluded on Tuesday morning.
Speaking on the occasion Dasa Sahitya project OSD Sri Ananda Thirtha Charyulu said after Sri Purandara Dasa, the Sri Vyasaraja Thirtha and Sri Vadiraja Thirtha had elevated the Dasa sankeertans to new heights. Their sankeertans had occupied an esteemed niche in the Bhajan Sampradaya.
On the final day of Dasa Mahotsav, as many as 300 artists of the Dasa Sahitya project performed Dasa sankeertans parayanam and Suprabatham etc.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముగిసిన శ్రీ వ్యాసరాజ తీర్థులు, శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు
తిరుమల, 2022 మార్చి 22: తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరిగిన ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలైన శ్రీ వ్యాసరాజ తీర్థులు, శ్రీ వాదిరాజ తీర్థులవారి ఆరాధనా మహోత్స వాలు మంగళవారం ముగిశాయి.
ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ దాస పదాలకు పట్టం కట్టిన వారిలో శ్రీ పురందరదాసు తరువాత స్థానం వీరిరువురికి దక్కుతుందన్నారు. భజన సంప్రదాయంలో వీరి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయని కొనియాడారు. భగవంతుని స్మరించడం ద్వారానే కలియుగంలో మోక్షం లభిస్తుందని, ప్రతిరోజూ స్వామివారిని స్మరించాలని కోరారు.
కాగా, చివరి రోజు దాదాపు 300 మంది దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు ఉదయం సుప్రభాతం, అనంతరం శ్రీ వ్యాసరాజ తీర్థులు, శ్రీ వాదిరాజ తీర్థుల సంకీర్తనలు పారాయణం చేశారు.
తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.