DASA SAHITYA ACTIVITY IS IMPECCABLE-TTD CHAIRMAN_ కలియుగంలో హరినామస్మరణే మోక్షానికి మార్గం : శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

HARINAMA SMARANA IS THE BEST WAY TO ATTAIN SALVATION-HH VIDYAPRASANNATEETHA SWAMI

Tirupati, 14 July 2018 : The Traimasika Metlotsavam by Dasa Sahitya Project of TTD is impeccable in the spread of Hindu Sanatana Dharma, said TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav.

Addressing over 3000 Bhajanaparas in III Chowltry premises on Saturday evening the Chairman said, Traimasika Metlotsavam is being observed four times in a year and rendering the devotional songs of Lord trekking Alipiri footpath is the best way to get His benign blessings”, he added.

Earlier in his religious discourse, HH Sri Sri Vidyaprasanna Teertha Swamy of Kukke Subrahmanya Mutt from Karnataka said, Lord Sri Krishna taught in Bhagavat Gita that the best way to attain salvation is by the way of “Hari Nama Smarana”. He complimented Dasa Sahitya Project Special Officer Dr P Ananda Teerthacharyalu for successfully taking ahead the religious fete in a big way from the past many years.

SHOBHA YATRA HELD

On Saturday morning shobha yatra in connection with Traimasika Metlotsavam held in Tirupati.

The procession commenced from Sri Govinda Raja Swamy temple and reached III Chowltry amidst the bhajans by thousands of Bhajanaparas.

Temple DyEO Smt Varalakshmi, Special Officer Dr P Ananda Teerthacharyalu of Dasa Sahitya Project were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కలియుగంలో హరినామస్మరణే మోక్షానికి మార్గం : శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

తిరుపతి, 2018 జూలై 14: కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని బెంగళూరులోని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవ కార్యక్రమాలు శనివారం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్రం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో మెట్లోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రంలో సాక్షాత్తు ఆదిశేషుడే కొలువయ్యారని, ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ టిటిడి ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో 20 ఏళ్ల నుండి క్ర‌మం త‌ప్ప‌కుండా మెట్లోత్స‌వం నిర్వ‌హిస్తోందన్నారు. సంవ‌త్స‌రంలో ధ‌నుర్మాసం, కార్తీకం, ఆషాడ మాసాల్లో ఈ మెట్లోత్స‌వం జరుగుతోందన్నారు. ఎందరో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు
శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారని చెప్పారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల‌ నుండి 3 వేల‌ మందికిపైగా భజనమండళ్ల
సభ్యులు పాల్గొనడం సంతోషకరమన్నారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర భక్తి ఛానల్ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, విజివో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.