TTD CHAIRMAN INSPECTS BALAJINAGAR COLONY IN TIRUMALA_ తిరుమల బాలాజి నగర్‌ కమ్యూనిటి భవనాన్ని పరిశీలించిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirumala, 14 July 2018: TTD Chairman Sri Putta Sudhakar Yadav on Saturday evening inspected Balaji Nagar Community Hall in the residential area in Tirumala. He assured the locals to develop the hall.

Later speaking to media the board chief said, there is need to develop community hall in Balaji Nagar area. I have instructed our engineering officials to ready the estimates to develop the community hall. The hall needa further extension for kitchen, dining hall, bath rooms etc. The flooring, roof needs improvement.

The chairman also said, road for Balaji Nagar area will be constructed at Rs.33 lakhs. During my next visit I will come with estimates for community hall and take up the works in another two or three months”, he added.

SE 2 Sri Ramachandra Reddy, EEs Sri Chandrasekhar, Sri Mallikarjuna Prasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల బాలాజి నగర్‌ కమ్యూనిటి భవనాన్ని పరిశీలించిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

జూలై 14, తిరుమల 2018: తిరుమలలోని బాలాజి నగర్‌లోని కమ్యూనిటి భవనమును, స్థానికులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ శనివారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కమ్యూనిటి భవనములో ఫ్లోరింగ్‌, డైనింగ్‌హలు, వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజి నగర్‌లోని సమస్యలను స్థానికులు తనకు తెలియచేశారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఇటీవల బాలాజి నగర్‌లో రోడ్ల నిర్మాణానికి టిటిడి రూ.33 లక్షలు మంజూరు చేసిందన్నారు. అనంతరం అక్కడి స్థానికులకు టిటిడి చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇలు శ్రీ మల్లికార్జున ప్రసాద్‌, శ్రీ చంద్రశేఖర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.