DASARA FESTIVAL AT DEVUNI KADAPA TEMPLE OF SRI LAKSHMI VENKATESWARA SWAMY_ సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
Tirupati, 20 September 2017: The Navaratri festival will be grandly celebrated at the TTD sub temple of Sri Lakshmi Venkateswaraswamy in Devuni Kadapa in Kadapa town from September 21 to 30.
Snapana Thirumanjanam in the afternoon and Vahana sevas in the evenings will be conducted every day as part of the Navaratri festival in the temple.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
సెప్టెంబర్ 20, తిరుపతి, 2017 : టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 21 నుంచి 30వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 21న తిరుచ్చి, సెప్టెంబరు 22న శేష వాహనం, సెప్టెంబరు 23న చంద్రప్రభ వాహనం, సెప్టెంబరు 24న హనుమంత వాహనం, సెప్టెంబరు 25న కడప పట్టణంలో, 27న పాత కడపలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబరు 26న తిరుచ్చి వాహనం, సెప్టెంబరు 28న గజ వాహనం, సెప్టెంబరు 29న తిరుచ్చి వాహనం, సెప్టెంబరు 30న అశ్వవాహనసేవలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.