DASAVATARA CASTS MAGIC SPELL _ అశ్వ వాహనసేవలో ఆకట్టుకున్న దశావతార నృత్య రూపకం

Tirumala, 25 September 2023: On Monday evening, the eighth day of Srivari Salakatla Brahmotsavams, the performances of art groups organized under the aegis of TTD Hindu Dharmic Projects before Aswa Vahana Seva impressed the devotees in a big way.

A total of 288 artists performed in 11 groups performed various arts during the procession of Vahanam.

Under the direction of the Principal of TTD run Sri Venkateswara Sangeet Nritya College, Tirupati, Smt. Umamuddubala, the students entertained devotees with Dasavatara Vaibhavam wearing the attires depicting ten incarnations of Lord in a colourful manner. 

Teams from Anantapur, Thiruvananthapuram, Tirupati entertained with Rajasthani dance.

Sri Y.G.Katthikar from Maharashtra mesmerized with Yogachap vinyasas.

The women employees of TTD were impressed with their Kolata dance performances under the direction of Kripavati troupe.

All Projects Programming Officer Sri. Rajagopala Rao, HDPP Secretary Sri. Srinivasulu, Dasa Sahitya Project Special Officer Sri. Ananda Theerthacharyulu supervised these programs.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అశ్వ వాహనసేవలో ఆకట్టుకున్న దశావతార నృత్య రూపకం

తిరుమల, 2023 సెప్టెంబరు 25: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వ వాహ‌నసేవ‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆక‌ట్టుకున్నాయి. మొత్తం 11 క‌ళాబృందాలలో 288 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో విద్యార్థులు దశావతార నృత్య రూపకంతో అలరించారు. అనంతపురానికి చెందిన బుచ్చిబాబు ఉరుముల భజనతో ఆకట్టుకున్నారు. తిరువనంతపురానికి చెందిన శ్రీమతి బృందం ఆధ్వర్యంలో భరత నాట్యం అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. తిరుపతికి చెందిన చందన బృందం రాజస్థాని నృత్యంతో కనువిందు చేశారు.

మహారాష్ట్రకు చెందిన యం.జి.కత్తీకర్ యోగచాప్ విన్యాసాలతో మైమరిపించారు.
రాజమండ్రికి చెందిన ఎ.సురేశ్ బాబు బృందం కోలాట నృత్యాలతో అలరించారు. తిరుపతికి చెందిన ప్రసాద్ బృందం కోలాట భజనలతో మైమరిపించారు.
విశాఖపట్నంకు చెందిన ఎ.భానురేఖ బృందం కూచిపూడి నృత్యాలతో మైమరిపించారు. విశాఖపట్నంకు చెందిన సునీత బృందం కోలాట భజనలతో అలరించారు. తితిదే ఉద్యోగుల మహిళలు కృపావతి బృందం ఆధ్వర్యంలో తమ కోలాట నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ‌ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.