ELABORATE ARRANGEMENTS FOR CHAKRA SNANAM _ శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

TIRUMALA, 25 SEPTEMBER 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy said that Tirumala Srivari annual Brahmotsavams is a huge success with the combined team work.

Speaking to the media on Monday evening on the occasion of the Aswa vahana Seva, he said arrangements have been made so that every devotee who attended Salakatla Brahmotsavam can witness vahana sevas.  He said that the Brahmotsavam will end on Tuesday morning with Chakrasnanam and divine flag lowering ceremony at night.

He said that arrangements have been made to observe Navratri Brahmotsavams as well in a big way giving priority to commoners.  He called upon the youth to write the Govinda Koti introduced by TTD to inculcate the sense of piety among the children from an early age.

EO inspects Chakra Snanam arrangements

TTD EO Sri. AV Dharma Reddy asked the devotees to exercise restraint during Chakra Snanam which will be held on Tuesday morning on the ninth and the last day of Srivari annual Brahmotsavams. 

The bathing ghats, entry and exit routes arranged at Pushkarini were examined. He said the divine power of sacred waters in Swamy Pushkarini will last the whole day and the devotees are requested to wait till their turn with patience and perform holy bath.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల, 2023 సెప్టెంబరు 25: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన ప్రతి భక్తుడు స్వామి వారిని కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆయన చెప్పారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని శ్రీ కరుణాకర రెడ్డి చెప్పారు. చిన్న తనం నుండే పిల్లల్లో భక్తి భావం పెంపొందించడానికి టీటీడీ ప్రారంభించిన గోవింద కోటి రాసి యువత తరించాలని ఆయన పిలుపునిచ్చారు.

భక్తులు సమయమనంతో చక్రస్నానం ఆచరించాలి- టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరగనున్న చక్రస్నానంలో భక్తులు సంయమనంతో వ్యవహరించి విడతలవారీగా పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్భంగా చక్రస్నానం ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. చక్రస్నానం ప్రభావం రోజంతా ఉంటుందని, తమ వంతు వచ్చేవరకు భక్తులు వేచి ఉండి చక్రస్నానం ఆచరించాలని కోరారు. కేరళ నిపుణులు గజరాజులను అదుపు చేసేందుకు వినియోగించే పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.