DEAF AND DUMB SCHOOL TO GET NEW LOOK AFTER SANKRANTI-CVSO_ ఎస్వీ బదిర పాఠశాలకు నూతన హంగులు : సివిఎస్‌వో
Tirupati, 11 January 2018: The TTD Chief Vigilance and Security Officer, Sri A Ravi Krishna, said that the children will enjoy an all new look after Sankranthi.
It may recalled that the top cop of TTD has adopted the SV Deaf and Dumb school few months ago.
On Thursday, the CVSO paved a visit to the school and expressed his pleasure about the improvements brought in the infra structure. “Here over 500 students are studying and teachers are grooming them in an extraordinary manner. When the students come back after Sankranthi holiday, they will enjoy an all new look in the school”, he said.
Additional CVSO Sri Siva Kumar Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఎస్వీ బదిర పాఠశాలకు నూతన హంగులు : సివిఎస్‌వో
తిరుపతి, 2018 జనవరి 11: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర బదిర పాఠశాల, కళాశాలకు నూతన హంగులు చేకూర్చుతున్నట్టు టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ తెలిపారు. పాఠశాలలో గురువారం ఆయన అలంకరణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ బదిర పాఠశాల, కళాశాలలో 500 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తాను దత్తత తీసుకున్న తరువాత విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లోని సృజనాత్మశక్తిని వెలికితీసి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు అంకింతభావంతో విద్యార్థులకు బోధిస్తున్నారని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం కల్పించేందుకు భవనాలకు రంగులు వేస్తున్నట్టు చెప్పారు. సెలవుల తరువాత వచ్చే విద్యార్థులకు పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనరసింహమూర్తి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.