DECEMBER FESTIVAL AT SRI GRT_ డిసెంబరులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 2 December 2017: Following are the detailed Schedule of the important festivals organised at the Sri Govindaraja Swamy Temple, in the month of December.
December 3: Pournami- Sri Govindaraja procession to Alwar theertham at Kapilatheertam-Thirumanjanam- Asthanam- Return to GRT- Deeparadhana and Deepotsavam.
December 8 and 29: Fridays, procession of Ammvaaru on mada streets of the GRT.
December 11: Asthanam of Sri Sri Govindaraja along with consorts Sri Bhudevi and Sri Devi in view of Uttara Naksatram.
December 11-15: Balalaya samprokshanam
December 16: Dhanurmasam begins
December 22: Procession of Sri Kalyana Venkateswaraswami on mada streets of GRT in view of Sravana nakshatram.
December 29-30: Procession of Sri Govindarajaswamy along with consorts Sridevi and Sri Bhudevi in view of Vaikunta Ekadasi and Dwadasi
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2017, డిసెంబరు 02: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– డిసెంబరు 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్‌తీర్థంకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో దీపారాధన, దీపోత్సవం నిర్వహించనున్నారు.
– డిసెంబరు 8, 29వ తేదీ శుక్రవారం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
– డిసెంబరు 11న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారికి ఆస్థానం నిర్వహించనున్నారు.
– డిసెంబరు 11 నుండి 15వ తేదీ వరకు ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
– డిసెంబరు 15న మహాసంప్రోక్షణలో భాగంగా ఉదయం మహాపూర్ణాహుతి, మకరలగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ పూర్తిచేసి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం
సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు పెద్దశేషవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– డిసెంబరు 16న ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
– డిసెంబరు 16న తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్రం.
– డిసెంబరు 22న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
– డిసెంబరు 29, 30వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని స్వామివారు ఉభయనాంచరులతో కలసి ఉదయం 8.00 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.