DECLARE SV VEDA UNIVERSITY AS NATIONAL UNIVERSITY- TTD CHAIRMAN APPEALS UNION EDUCATION MINISTER _ వేద విశ్వ విద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి – కేంద్ర విద్యా శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ వినతి.

  • SEEKS TTD QUOTA HIKE AT SV COLLEGE IN NEW DELHI

 Tirupati, 9 Dec. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Wednesday appealed to Union Education Minister Dr Ramesh Pokhryal to recognise the SV Vedic University as a National University and also hike TTD quota in the Delhi based SV College.

In a representation to the Union Minister at New Delhi, the TTD Chairman said the SV Vedic University, set up in 2006, was recognised by UGC as a State University under 2F category. He said the besides establishing the Vedic University with a noble aim to propagate and preserve Vedic studies for coming generations, TTD has also established Veda Pathashalas and providing financial support to over 80 such Veda Pathashalas across the country. He requested for recognition as 12 B for the 14-year-old institution as a Central University, on the lines of the status given to three other Sanskrit Universities in the country.

The TTD Chairman said the Institution is providing Degree to Doctorate (PG courses) in various segments of Vedic Sciences and will be the first institution of erudite Sanskrit education in the country. The AP government will provide all support for promotion and propagation of Vedas through TTD, he maintained.

In a separate representation, Chairman further requested the Union Minister also to increase the quota in Telugu, Tamil and Sanskrit courses in the TTD managed Sri Venkateswara College at New Delhi. He said the request for hike in quota in institution, for which foundation was laid in 1961 by the then Vice-Present Sri Sarvepalli Radhakrishnan has been pending with the Delhi University since 2016.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేద విశ్వ విద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి –    కేంద్ర విద్యా శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ వినతి.  

 తిరుపతి, 9 డిసెంబరు 2020: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయం గా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర  వేద విశ్వ విద్యాలయాన్ని  జాతీయ వేద విశ్వవిద్యాలయం గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి  కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు.

2006 లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయం గా ప్రారంభించామన్నారు. 2007లో యుజిసి దీన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా గుర్తించిందని చైర్మన్ వివరించారు. ఈ వర్శిటీ  వేదాల్లో డిగ్రీ నుంచి పిహెచ్ డి దాకా అనేక కోర్సులు నడుపుతోందన్నారు.

సనాతన సంప్రదాయమైన వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాల లు నడపడంతో పాటు, దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందన్నారు. వేదం చదివిన వారిని ఆదుకోవడానికి  ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్, అగ్నిహోత్రం ఆర్థిక పథకాలు అమలు చేస్తోందన్నారు. 14 సంవత్సరాలుగా టీటీడీ నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12బి కేటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల హోదా ఇచ్చిన విధంగా, ఎస్ వి వేద విశ్వవిద్యాలయానికి జాతీయ వేద విశ్వ విద్యాలయం హోదా ప్రకటిస్తే  దేశంలో తొలి వేద విశ్వవిద్యాలయం గా గుర్తింపు పొంది,  దేశవ్యాప్తంగా వేద విద్య వ్యాప్తికి తోడ్పాటు కలుగుతుందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ద్వారా వేద విద్య ఉన్నతికి కట్టుబడి ఉందని మంత్రికి విన్నవించారు.

ఎస్వీ కాలేజి లో కోటా పునరుద్ధరించండి  

ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న  శ్రీ వేంకటేశ్వర కాలేజ్ లో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని శ్రీ సుబ్బారెడ్డి మంత్రికి మరో వినతి పత్రం సమర్పించారు. 2016 ముందు వరకు అమలైన  ఈ కోటాను ఆతరువాత ఢిల్లీ యూనివర్సిటీ  అనుమతించడం లేదన్నారు. 1961 లో ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ శంఖుస్థాపన చేసిన ఈ కళాశాలను ఢిల్లీలో ని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్చిదిద్దిందన్నారు.                      

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది