DEEPAVALI ASTAHANAM AT SRI GT ON NOVEMBER 4 _ న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

TIRUPATI, 26 OCTOBER 2021:The annual Deepavali Asthanam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on November 4.

New silks will be presented to the presiding deity from Sri Pundarikavalli Tayar Sannidhi and Asthanam will be observed between 5 pm and 6 pm on the same day.

In connection with Deepavali Asthanam, the Koil Alwar Tirumanjanam will be performed on November 2.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుపతి, 26 అక్టోబ‌రు 2021 ; తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 4వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆస్థానం జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

న‌వంబ‌రు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

దీపావళి ఆస్థానం సంద‌ర్భంగా ఆలయంలో న‌వంబ‌రు 2వ‌ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆన‌వాయితీ.

ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.