DEEPAVALI ASTHANAM ON NOVEMBER 04 AT TIRUMALA TEMPLE _ న‌వంబ‌రు 4న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirumala, 26 October 2021: TTD will be organizing the traditional annual fete, Deepavali Asthanam at Sri Venkateswara Swamy temple in Tirumala on November 04 in connection with the Deepavali festival.

After Nitya Kaikaryas of the day including Suprabatham the Asthana will be held at the Ganta Mandapam in Bangaru vakili between 7 am and 9 am.

As part of celebrations, the utsava idols of Sri Malayappa will be seated on Sarva Bhupala vahanam along with Sridevi and Bhudevi facing Garudalwar idols with His Senadhipati Sri Viswaksena seated adjacent to him. The Asthanam fete will conclude after special pujas, Harati and Prasada Nivedana.

Later in the evening, Sri Malayappa and His consorts will participate in the Sahasra Deepalankara Seva and thereafter will parade on Mada streets to bless devotees.

In view of Deepavali celebrations, the TTD has canceled all virtual arjita sevas including Kalyanotsavam, Unjal seva, Arjitha Brahmotsavam on that day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 4న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమ‌ల‌, 26 అక్టోబ‌రు 2021 ; దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 4వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గంట‌ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా న‌వంబ‌రు 4న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.