DEEPAVALI ASTHANAM, KOIL ALWAR AND SITARAMA KALYANAM AT SRI GT_ అక్టోబరు 19న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirupati, 12 October 2017: The holy festival of Deepavali Asthanam will be held at the TTD sub temple of Sri Govindaraja Swamy Temple on October 19,Thursday Amavasvya from 5.30pm to 6.30pm.

Ahead of the event new silk robes and deepam from the sub temple-Sri Pundarikavalli ammavari temple in the GT complex will be presented to Sri Govindaraja Swamy.

KOIL ALWAR AT GRT ON OCT 18

The ritual of Koil alwar Thirumanjanam will be performed in the GRT temple as part of its annual program ahead of Dipavali on Oct 18th.

As part of Thirumanajanam, all the puja material, walls ad roof of the GT will be cleaned with traditional herbs and detergents Kasturi, Pasupu, sandal powder. Kichili gadda and other perfume waters etc.Temple will be opened up for devotees from 9.00AM onwards.

SRI MANAVALA MAHAMUNI ANNUAL UTSAVAM AT GT ON OCT 16 TO 25

The annual utsavam of sub temple in Sri GRT, the Sri Manavaa Mahamuni will commence from Oct.16 and will end with grand Sat-mura event on Oct.25 .A special treat of Appam from Srivari Temple will be presented to Sri Manavaa Mahamuni on the ocassion of the procession of Sri Govindaraja swamy along with consorts and Sri Manavaa Mahamuni in the temple mada streets.

Legends say that Sri Manavaa Mahamuni was one of the 15th century prominent Srivaishanvite disciple of Lord Venkateswara who propounded the Vishista Advaita philosophy.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

అక్టోబరు 19న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుపతి, 2017 అక్టోబరు 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 19వ తేదీ గురువారం దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు.

దీపావళి సందర్భంగా అక్టోబరు 19వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.

అక్టోబరు 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 18వ తేదీ బుధవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబరు 19వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

అక్టోబరు 16 నుంచి 25వ తేదీ వరకు శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఉప ఆలయమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం అక్టోబరు 16 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా జరుగనుంది. అక్టోబరు 25వ తేదీన శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.00 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పిస్తారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మనవాళ మహామునితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

శ్రీ మనవాళ మహాముని 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తిచేసిన శ్రీవైష్ణవ ఆచార్యపురుషుడు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.