GRAND PAVITHROTSAVAM AT CHANDRAGIRI SRI KRT_ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

Tirupati, 12 October 2017: The three day grand Pavitrotsavam festival at the at sub temple, Sri Kodandarama Temple,Chandragiri commenced with pomp and glitter of the pavitra samarpanam on Thursday.

In the morning Suprabatham, Sahasrarchana and Nityarchana were performed the utsava idols of Sita Lakshmana with Sri Rama were brought to the Yaga shala where Homa kumbharadhana, mandala puja and upa-kumbharadhana homas were performed

As part of the event pavitrams were submitted to idols ofmain deity, Sri Narasimhaswamy,Sri Goda Devi ammavaru,12 alwars,Sri Venugopalaswamy and Sri Anjaneya swamy, Sri Garuda alwar, Sri Viwaksena swami, homa kundam, balipethams, dwaja sthamabams at the yagashala.
Among others TTD local temples Dy EO Sri Venkataiah, AEO Sri Dhanajayalu, Kankanabhattar Sri Krishna Bhatta, Temple Inspector Sri Lilasri ,other officials and devotees participated.

Sri Sitarama Kalyanam @October 13

On the ocassion of the Punarvasu,birth star of Lord Sri Rama,the TTD plans to conduct grand Sri Sitarama Kalyanam in the evening of October 13.Interested devotees could participate with a token payment of Rs,300 (per couple) and beget blessings of Lord along with one Uttariyam,One blouse, Appam and Anna prasadams .


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2017 అక్టోబరు 12: టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమకుంభారాధన, మండలపూజ, ఉపకుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.

ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్లకు, శ్రీ నరసింహస్వామివారు, శ్రీగోదాదేవి అమ్మవారు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ వేణుగోపాలస్వామివారు, శ్రీ వీర ఆంజనేయస్వామివారు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీధనంజయులు, కంకణభట్టర్‌ శ్రీ కృష్ణభట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారి లీనశ్రీ, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అక్టోబరు 13న శ్రీ సీతారాముల కల్యాణం :

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 13వ తేదీ శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో సాయంత్రం 5.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.