DEEPAVALI ASTHANAM IN TIRUMALA ON NOV 7_ శ్రీవారి ఆలయంలో నవంబరు 7న దీపావళి ఆస్థానం

Tirumala, 1 November 2018: The religious temple court ceremony in connection with the festival of lights will be observed in Tirumala on November 7.

This fete takes place at Bangaru Vakili in Garudalwar Sannidhi between 7am and 9am.

The processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi along with Vishwaksena are seated opposite Garudalwar and Asthanam will be performed.

TTD has cancelled all arjitha sevas in connection with this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో నవంబరు 7న దీపావళి ఆస్థానం

నవంబరు 01, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 7వ తేదీ బుధవారం ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.