VIGILANCE DARBAR OBSERVED_ భక్తుల భద్రతే ధ్యేయంగా టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది విధులు నిర్వహించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 31 October 2018: On the occasion of Jatiya Samaikhyata Divas, Vigilance Darbar was observed in Mahati Auditorium at Tirupati on Wednesday under the aegis of TTD Vigilance and Security wing.

TTD EO Sri Anil Kumar Singhal who graced the occasion as Chief Guest, in his address complimented the TTD Vigilance and Security wing for their impeccable services. “The twin brahmotsavams in Tirumala were a huge success because of your commendable services, day and night. You have offered incident free services to tens of thousands of pilgrims during the mega religious events in co-ordination with the police. I also thank your families for their support without which this is not possible”, he added. The EO also lauded the services of vigilance officials in trapping the middlemen who are involved in the black marketing of laddus, on-line arjitha seva tickets and VIP break darshan scandals.

In his address, Tirupati JEO Sri P Bhaskar described the Vigilance and Security sleuths of TTD as representatives of divine Commander in Chief, Vishwaksena. Like we perform Vishwaksena Aradhana before every religious event seeking success, you all contributed a major part in the success of annual and Navarathri brahmotsvams in Tirumala.

Earlier, some vigilance and security sleuths brought to the notice of EO and JEO some of the issues which they have been facing including meager wages, no promotions in spite of decades of service, non sanctioning of TA, DA and petrol allowances, ID cards, Health Cards etc.

Reacting to their issues, EO said, a sub-committee was appointed by the Trust board during the last meeting itself to discuss on these issues. “TTD Chairman and myself are also members in this committee and we will resolve the issues which are possible in phased manner in the upcoming board meets”, he assured.

Later, mementos have been presented to the vigilance and security wing officers, sleuths who excelled in their services.

CVSO (FAC) Sri Siva Kumar Reddy, VGOs Smt Sada Lakshmi, Sri Ashok Kumar Goud, Sri Manohar, SPF DSP Sri Sankar Rao, Additional Fire Officer Sri Hemanth Reddy, DyEE Vigilance Wing Sri Radhakrishna Reddy, AVSOs, VIs, Home Guards, security and vigilance personnel were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తుల భద్రతే ధ్యేయంగా టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది విధులు నిర్వహించాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018, అక్టోబరు 31: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తతతో టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రశంసించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో ”విజిలెన్స్‌ దర్బార్‌” నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది తిరుమల శ్రీవారికి జరిగిన రెండు బ్రహ్మోత్సవాల విజయానికి సమర్దవంతంగా విధులు నిర్వహించిన విజిలెన్స్‌, నిఘా విభాగం అధికారులు, సిబ్బంది సేవలు అత్యుత్తమైనవని అన్నారు. ఇటీవల తిరుమలలో దర్శనం, వసతి, లడ్డూ, ఆన్‌లైన్‌ ఆర్జీత సేవ టికెట్లను అక్రమ మార్గంలో విక్రయించే దళారులను పట్టుకోవడంలో విజిలెన్స్‌ సిబ్బంది కనబరచిన ప్రతిభను అభినందించారు. టిటిడిలోని నిఘా మరియు భద్రతా సిబ్బంది శారీరకంగాను, మానసికంగాను దృడంగా ఉండి సేవలందిస్తున్నారని అందుకు సహకరిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రత్యేక పర్వ దినాలు, సంవత్సరంలో దాదాపు 100 రోజులు వరకు అధిక రద్దీ ఉండేదని, అయితే ప్రస్తుతం అధిక రద్దీ రోజులు మరింత పెరిగాయని తెలిపారు.

అంతకుముందు విజిలెన్స్‌ సిబ్బంది తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ఇందులో భాగంగా జీత బత్యాల పెంపు, పదోన్నతులు, టిఏ,డిఏ, వాహనాలకు పెట్రోల్‌ అలవెన్స్‌లు, వైద్య సదుపాయాలు, లడ్డూకార్డు, ఐడి కార్డు తదితర సమస్యలను ఈవో దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఈవో స్పందిస్తూ విజిలెన్స్‌ సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విజిలెన్స్‌ సిబ్బంది సమస్యలపై ఇప్పటికెే టిటిడి బొర్డు సబ్‌కమిటి ఏర్పాటు చేసిందని, ఇందులో తాను, టిటిడి ఛైర్మన్‌ సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. కాగా రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో విజిలెన్స్‌ సిబ్బంది సమస్యలపై చర్చించి నిబంధనలకు లోబడి దశలవారిగా పరిష్కరించనున్నట్లు వివరించారు.

తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడి ప్రతినిధులుగా భద్రాతా సిబ్బంది భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నారన్నారు. భద్రతా కల్పించాలన్నారు. టిటిడిలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌, నిఘా విభాగం టిటిడి ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తిరుపతి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ వ్యవహరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన విజిలెన్స్‌, నిఘా విభాగం అధికారులకు, సిబ్బందికి ఈవో జ్ఞాపికలు అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివోలు శ్రీమతి సదాలక్ష్మీ, శ్రీ మనోహర్‌, ఎస్పీఎఫ్‌ డిఎస్‌పి శ్రీ శంఖర్‌రావు, అడిషనల్‌ ఫైర్‌అఫీసర్‌ శ్రీ హేమంత్‌ రెడ్డి, డిప్యూటీ ఈఈ (విజిలెన్స్‌) శ్రీ రాధాకృష్ణారెడ్డి, ఎవిఎస్వోలు, విజిలెన్స్‌ సిబ్బంది, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.