DENIZENS ADMIRES TTD CULTURAL PROGRAMMES _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

TIRUPATI, 22 NOVEMBER 2022: The series of cultural programmes planned by TTD in connection with the ongoing annual Karthika Brahmotsavams have been alluring the denizens and devotees to a great extent.

Renowned artistes from the fields of dance, music, harikatha, pravachanam have been invited to perform on the celestial occasion at different venues including Tiruchanoor Asthana Mandapam, Urban Haat, Mahati Auditorium, Sri Ramachandra Pushkarini, Annamacharya Kalamandiram have been receiving huge applause from the denizens and devotees equally.

On Tuesday, the devotional musical concerts by Smt Anvita, Sri Raghuramakrishna teams from Bengaluru, Harikatha by Smt Sharada Bhagavatar of Tenali, Sri Narasimha Rao team belonging to Tiruppur of Tamilnadu, Nadaswaram, Dolu by TTD SV College of Music and Dance students and many more won the hearts of the art lovers.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2022 న‌వంబ‌రు 22: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ మునిరత్నం, శ్రీ చంద్రశేఖర్ బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి జానకి ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన అన్విత బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీమతి శారద భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన లావణ్య, శ్రీ రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం భక్తి సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరువూరుకు చెందిన శ్రీ నరసింహారావు బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఎస్వీ సంగీత నృత్య కళాశాల నాదస్వరము మరియు డోలు ప్రవీణ విద్యార్థులచే వాద్య సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే వాద్య సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.