DENIZENS THRONG IN LARGE NUMBERS FOR THE KARTHIKA MAHA DEEPOTSAVAM ORGANISED BY TTD _ అత్యంత వేడుకగా కార్తీక దీపోత్సవం
MORE UNIQUE SPIRITUAL PROGRAMMES IN KARTHIKA MONTH-TTD EO
TEMPLE CITY SHINES UNDER THE BRIGHT ILLUMINATION OF GHEE LIT LAMPS
TIRUPATI, 18 NOVEMBER 2022: The temple city reverberated to the divine chants of Govinda Namas and shined bright in the illumination of scores of ghee lit lamps in the Parade Grounds of TTD as part of Karthika Maha Deepotsavam event on Friday night.
Speaking on the auspicious occasion of Karthika Deepotsavam the TTD EO Sri AV Dharma Reddy said, TTD mulled Karthika Deepotsavam from the past two years, with an aim to spread the divine power in the human lives which will keep them strong and healthy through out their life.
He said, earlier in Yaganti and Visakhapatnam, Karthika Maha Deepotsavam were observed which received humongous repsonse from the denizens of the respective places. “Tirupati is the third in the row to observe the fete. More religious and spiritual programmes have been mulled in the days to come at different parts across the country in the sacred month of Karthika”, the EO added.
DEEPA LAKSHMI DANCE ALLURES DENIZENS
The devotional dance ballet “Deepa Lakshmi Namostute”, by students of TTD’s SV College of Music and Dance, sankeertans by Annamacharya Project artists, and commentary by Vedic Pundit Dr. Maruti stood as a special attraction for the entire event.
The devotees chanted Deepa Mantram and Lakshmi Astottaram, Vishnu Sahasra Nama Parayanam in chorus with the archakas under the directives of Veda Pundits and performed Deepotsavam in a grand manner.
Chief priests of Tirumala Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, and Sri Govindaraja Deekshitulu performed the rituals to the utsava deities of Sri Bhu sameta Sri Srinivasa Swamy along with Mahalakshmi Ammavaru while Archaka Sri Sai Swamy rendered all relevant Shlokas and performed pujas.
Later the EO felicitated the TTD Contractors who have come forward to organize the religious event with aplomb. Earlier the artists and religious staffs were also felicitated for the grand success of the event.
Board members Sri Ashok Kumar, Sri Marutiprasad, Sri Sriramulu, Commissioner Kum Anupama Anjali, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Chariman SVBC Sri Saikrishna Yachendra, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, VGO Sri Manohar, Garden Superintendent Sri Srinivasulu, DFO Sri Srinivas, DE electrical Sri Ravi Sankar Reddy, many senior officials, scores of employees, denizens were also present.
రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం
– టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి
-. అత్యంత వేడుకగా కార్తీక దీపోత్సవం
– గోవింద నామస్మరణతో మారుమోగిన టీటీడీ పరిపాలన భవనం మైదానం
– భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
తిరుపతి, 18. నవంబరు 2022: రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు.
టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. ఈ సందర్బంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడారు.
కార్తీక మాసంలో టీటీడీ శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులోభాగంగా ఈ ఏడాది కార్తీక మాసంలో యాగంటి, విశాఖపట్నం, తిరుపతి లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తి ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఈవో చెప్పారు.
కార్తీక మహా దీపోత్సవం ఇలా …
పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగాజరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు.
పండితులు డాక్టర్ మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డాక్టర్ మారుతి దీప ప్రాశస్త్యం తెలియజేశారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీవారి తిరువారాధన నిర్వహించారు. పండితులు విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన దీపలక్ష్మి నమోస్తుతే నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది . భక్తులతో దీప మంత్రం 9 సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్క సారిగా చేసిన దీపారాధన వెలుగులతో మైదానం నిండింది. చివరగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.జేఈవో శ్రీమతి సదాభార్గవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు .
టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి దంపతులతో పాటు ఎస్వీబిసి చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర , జేఈవో శ్రీ వీరబ్రహ్మం , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ. పోకల అశోక్ కుమార్ , శ్రీ మురం శెట్టి రాములు ,శ్రీ మారుతి ప్రసాద్ , తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు ,సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి ,ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ లు శ్రీ జగదీశ్వర రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు,
అర్చక బృందం , వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించింది. దాతలను ఈవో శ్రీ ధర్మారెడ్డి సన్మానించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.