DEVOTEES ADORE VENNEMUDDA KRISHNA ON CHANDRAPRABHA _ చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

TIRUPATI, 26 NOVEMBER 2022: On the seventh day evening, Goddess Sri Padmavathi Devi donned the avatar of cute and mischievous little Krishna holding a pot full of butter in His hand, blessed devotees on the soothing

Chandraprabha Vahanam along the Mada streets of Tiruchanoor.

 

On the pleasant evening of Saturday, the devotees were mused by this adorable Venne Mudda Krishna Avatar of Goddess Sri Padmavathi Devi and experienced a chill-thrill feel on seeing the cool look of Goddess on Chandraprabha Vahanam.

 

HH Sri Pedda Jeeyar and HH Sri Chinna Jeeyar Swamijis of Tirumala, Chandragiri Legislator Sri C Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar, SE 3 Sri Satyanarayana, SE Electrical Sri Venkateswarulu, EE Sri Narasimhamurthy, DyEO Sri Lokanatham and others were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి, 2022 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ‌ వీరబ్రహ్మం దంప‌తులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఎస్ఇ-3 శ్రీ సత్యనారాయణ, ఈ ఈ శ్రీ నరసింహ మూర్తి ,ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.