DEVOTEES APPEALED TO USE TTD’s RO WATER TO REDUCE PLASTIC USAGE IN TIRUMALA_ తిరుమలలో సురక్షిత త్రాగు నీటిని వినియోగించాలి – భక్తులకు టీటీడీ వినతి

Tirumala, 30 Jul. 19: In a bid to ban usage of plastic completely in Tirumala, the devotees are requested to make use of the RO water and Jalaprasadam set up by TTD everywhere in Tirumala.

During the weekly review meeting by Special Officer of Tirumala Sri AV Dharma Reddy in his camp office at CRO on Tuesday, he said, the usage of plastic bottles should be completely banned in a phased manner in the hill town which is visited by tens of thousands of pilgrims everyday.

With an aim to provide enhanced amenities to the multitude of visiting pilgrims, a senior officer has been allotted an area to sort out the issues in respective places in Tirumala like HVC, SPRH, NGRH, VSH etc. “The officer who is allotted with the particular place should adopt each area and resolve the issues related to civil, electrical, FMS, sanitation etc. by bringing the problems to the notice of the concerned HoD”, he added.

FACAO Sri O Balaji, Additional CVSO Sri Venkata Siva Kumar Reddy, SE II Sri Ramachandra Reddy, Temple DyEO Sri Harindranath, Health Officer Dr RR Reddy, DyEOs Smt Parvathi, Sri Balaji, Sri Venkataiah and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో సురక్షిత త్రాగు నీటిని వినియోగించాలి – భక్తులకు టీటీడీ వినతి

తిరుమల, 2019 జూలై 30: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలను ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నార‌ని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లను దశలవారీగా నిషేధించేందుకు భక్తులు సహకరించాలని టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమలలోని సి.ఆర్‌.వో వ‌ద్ద గ‌ల తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి కార్యాల‌యంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గతంలోనే దశల వారీగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించాలని టీటీడీ నిర్ణఇంచిన సంగతి విదితమే. టీటీడీ తిరుమలలోని అన్నిప్రాంతాలలో భక్తులకు జల ప్రసాదం, కొళాయిల ద్వారా శుద్ధిచేయబడిన సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నదని ప్ర‌త్యేకాధికారి తెలిపారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకుని ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు.

అనంతరం ప్రత్యేకాధికారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలను విభజించి సీనియర్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. ఇటీవల తిరుపతిలోని టిటిడి అనుబంధ ఆలయాలకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించడం ద్వారా మంచి ఫలితాలు సాధించిన తెలిసిందే. అదేవిధంగా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తుల వసతి సముదాయాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, విద్యుద్దీపాలు, తాగునీరు తదితర అంశాల్లో మెరుగైన ఫలితాలు తీసుకురావచ్చని ప్రత్యేకాధికారి తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్‌ఏ సిఏవో శ్రీ బాలాజి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామ‌చంద్రారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఆర్యోగ్య శాఖ అధికారి శ్రీ ఆర్.ఆర్.రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి , విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌దానం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.