PATTABHISHEKA MAHOTSAVAM AT SRI PRT VALMIKIPURAM FROM AUG 5-7_ ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

Tirupati, 30 Jul. 19: TTD plans to conduct the Pattabhiseka Mahotsavam at Sri Pattabiram Temple Of Valmikipuram from August 5-7 beginning with Ankurarpanam on August 5.

On August 6 snapana thirumanjanam will be performed to utsava idols, unjal seva in evening, Sitarama Shanti Kalyanam and thereafter Hanumanta vahanam at night.
On August 7 Srirama Pattabhiseka Mahotsavam is performed after snapana thirumanjanam, unjal seva, and there after Garuda vahanam and Maha Purnahuti.

Interested couples could participate with ticket of ₹300 and beget one uttarium, one blouse; Anna Prasadam etc. On all three days the artists of HDPP, Annamacharya Project will render harikatha, bhajans, and Bhakti sangeet to regale the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

జూలై 30, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 5న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.

ఆగస్టు 6వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ, 7 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 9గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 7న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. రాత్రి 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.

గ హస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టిటిడి హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.