HIGHLIGHTS DURING DIAL YOUR EO _ ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు తిరుమలలో ధార్మికసదస్సు

Tirumala, 05 January 2024:  TTD EO Sri AV Dharma Reddy during the devotee interactive live phone-in program, the Dial Your EO held at Annamaiah Bhavan on  Friday has briefed on some upcoming events before taking the calls. Some excerpts :

TTD has been providing Srivari Darshan for the participants in Srinivasa Divyanugraha Homa at Alipiri SaptaGopradakshina Mandiram on purchase of Rs.300 tickets through Special Entry.

Dharmic Sadas: 

TTD is organising a Dharmic Sadas during 3-5 of February with peethadhipathis from all over the country as part of the Sanatana Hindu dharma propagation.

TTD has agreed to provide one lakh laddus weighing around 25 gms each for distribution among the visitors during Sri Rama Prana Pratistha ceremony at Rama Mandiram in Ayodhya

TTD sets to organise grand fete of Sri Goda Kalyanamon January 15 evening at parade grounds behind TTD administrative building 

TTD reiterated to utilise only the  ttdevasthanams.ap.gov.in for  booking arjita Sevas, donations, Darshan and rooms  

Special festivals at Tirumala in January includes Srivari Parveta utsavam on January 16  on the day of the Kanuma festival and Sri Ramakrishna  Theertha Mukkoti on January 25.

JEO s Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao and other officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు తిరుమలలో ధార్మికసదస్సు

– జ‌న‌వ‌రి 22న అయోధ్య‌కు ల‌క్ష శ్రీ‌వారి ల‌డ్డూలు

– శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 05: సనాతన హైందవ‌ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థ‌ల‌తో సదస్సు నిర్వ‌హించ‌నున్నాట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– అయోధ్యలో 22వ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం.

– తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూ లైన్‌లో టికెట్ (రూ.300/-) కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం.

– ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్‌ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తాం.

– శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను కోరడమైనది.

•⁠ ⁠తిరుమ‌ల‌లో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి వైభ‌వంగా నిర్వ‌హిస్తాం

డిసెంబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

•⁠ ⁠శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 19.16 లక్షలు.

హుండీ :

•⁠ ⁠హుండీ కానుకలు ` రూ. 116.73 కోట్లు.

లడ్డూలు :

•⁠ ⁠విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` ఒక కోటి 46 వేలు.

అన్నప్రసాదం :

•⁠ ⁠అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 40.77 లక్షలు.

కల్యాణకట్ట :

•⁠ ⁠తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 6.87 లక్షలు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సిఈ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.