DEVOTEES CAPTIVATED BY THE DIVINE GRACE OF “GAJALAKSHMI”_ గజవాహనంపై అమ్మవారు కనువిందు

Tiruchanur, 19 November 2017 : Tens of thousands of pilgrims converged four mada streets encircling the famous shrine of Goddess Padmavathi Devi at Tiruchanoor to witness Gaja Vahana Seva on Sunday evening.

Being one of the most important Vahana sevas during the ongoing Navahnika Brahmotsavams, the Goddess as Gaja Lakshmi in all Her divine splendour appeared on the mighty golden elephant carrier, which happens to be Her most favourite vehicle.

According to our Puranas, history and even at present, the elephant is considered to be a symbol of mightiness, prosperity and regality. Goddess Padmavathi is the deity of Riches and Her royal enhanced when she took a pleasure ride on Gaja Vahanam in the pleasant evening on Sunday.

The Lakshmi Kasula Haram brought from Tirumala, magnified the rich look of Goddess Padmavathi Devi who blessed the pilgrim devout as Gaja Lakshmi.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, Tirumala JEO Sri Srinivasa raju,CVSO Sri A Ravikrishna and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజవాహనంపై అమ్మవారు కనువిందు

తిరుపతి, 19 నవంబరు 2017 ; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజైన ఆదివారం రాత్రి అమ్మవారు తనకు ప్రీతిపాత్రమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి దేవి స్వర్ణ గజ వాహనంపై విహరిస్తుంది. గజపటాన్ని ఆరోహణం చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలమేలు మంగ వాహనసేవలలో గజవాహన సేవ ఘనమైంది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.