DEVOTEES EXPERIENCE THE GRANDEUR OF SITARAMA KALYANAM_ శోభాయమానం శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 26 March 2018: The pleasant evening on Monday witnessed the grand wedding ceremony of the divine couple, Lord Sri Rama with Sita Devi.

The celestial Kalyanam was performed between 6pm and 8pm in Sri Kodanda Rama Swamy temple.

Devotees turned out in thousands to catch a glimpse of the most splendid divine wedding.

The Kalyana Vedika in the temple premises was decked up with flowers and light illumination adding extra splendor to the wedding.

TTD EO Sri Anil Kumar Singhal along with his spouse took part in this celestial marriage. The religious staffs chanted vedic mantras and performed the marriage to in the traditional manner.

Devotees were thrilled to witness the wedlock. Later Mutyala Talambralu packets were also distributed to the devotees.

Tirupati JEO Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi, Garden Superintendent Sri Srinivasulu and other staffs, large number of devotees were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శోభాయమానం శ్రీ సీతారాముల కల్యాణం

మార్చి 26, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. కల్యాణానికి విచ్చేసిన భక్తుల కోసం పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను కల్పించామన్నారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభమైంది. టిటిడి వైఖానస ఆగమ పండితులు శ్రీ పి.సీతారామాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధన పూ, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మార్చి 27న శ్రీరామ పట్టాభిషేకం :

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27న మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం నరసింహతీర్థం నుండి తీర్థం తీసుకొచ్చి అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిలో శ్రీసీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిలో శ్రీ ఆంజనేయస్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. మార్చి 28వ తేదీన రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం జరుగనుంది.

మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తెప్పోత్సవాలు :

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు మార్చి 29 నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుడి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి10 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదు చుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.