DEVOTEES IMMERSED IN AKHANDA PARAYANAM OF AYODHYA KANDA _ భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 21 January 2024: The 6th Edition of Ayodhya Kanda Akhanda Parayanam held on Sunday morning on the Nada Neerajanam platform in Tirumala, which was live telecasted by  SVBC between 7 am to 9 am for the sake of global devotees.

A total of 224 shlokas were recited including 199 shlokas from 18th to 21st sargas of Ayodhya Kanda, 25 shlokas from Yogavasishtam and Dhanvantari Mahamantram.

Dharmagiri Vedic scholars Dr K. Ramanujacharya, Sri Ananta Gopalakrishna, Dr. Maruti recited shlokas.  Faculty members of Dharmagiri, SV Vedic University, Vedic scholars, students and scholars from SV Higher Vedic Studies,  National Sanskrit University participated in this  Akhanda Parayanam.

On this occasion, the artists of the Annamacharya Project led by Sri Srinivas and the troupe sang “Rama Sitarama…” Ramadasa Kirtan at the beginning of the program and “Ramuni Bhajan Seyave Manasa…” at the end in a melodious manner.

TTD officials, scholars and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 21 జ‌న‌వ‌రి, 2024: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉదయం జరిగిన 6వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అయోధ్యకాండలోని 18 నుండి 21వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం నాలుగు స‌ర్గ‌ల్లో 199 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 224 శ్లోకాల‌ను పారాయణం చేశారు.
           
ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. కె.రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాలకృష్ణ, డా. మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ బృందం “రామా సీతారామా…. ” అనే రామదాసు కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రాముని భజన సేయవే మనసా ……” అనే నామ సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.