TTD CHAIRMAN IN AYODHYA _ బాల రామయ్య ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
Tirumala, 21 January 2024: TTD Chairman Sri Bhumana Karunakar Reddy visited Ayodhya Rama Mandiram on Sunday.
Sri Karunakara Reddy will be participating in the Prana Pratistha Mahotsavam of Sri Bala Rama on January 22.
Ayodhya Rama Mandir Trust representative Sadhvi Ritambari welcomed him on his arrival at Sri Rama Mandiram.
Later, Sri Karunakar Reddy visited the Ram Temple and participated in the special pujas being held on the occasion.
Later the Chairman handed over one lakh laddus specially prepared at Tirumala Srivari Temple to the representatives of Ram Mandir Trust to distribute among the devotees participating in the Rama Mandir opening ceremony scheduled on Monday.
The TTD Board Chief spoke to artists and representatives of Vishwa Hindu Parishad who arrived in Ayodhya from various states besides Andhra Pradesh.
Speaking to the media on this occasion he said that Sri Venkateswara Swamy, who shone as Swayam Bhu(Self-manifested) in Tirumala in Kali Yuga, was Sri Ramachandra Murthy in Treta Yuga.
He expressed his happiness that being the first servant of Sri Venkateswara Swamy, he was lucky enough to participate in the prestigious and historical opening ceremony of Rama Mandiram.
He extended his warm wishes to those who contributed to the construction of the Ram Temple in Ayodhya and to all the devotees participating in the opening ceremony of the temple.
రామయ్య సేవలో శ్రీవారి ప్రథమ సేవకుడు
• బాల రామయ్య ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
• ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామ నామం , నామాలతో సాంప్రదాయ బద్దంగా అయోధ్య ఆలయానికి వెళ్ళిన శ్రీ కరుణాకరరెడ్డి
• జనవరి 22న (రేపు) బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్న శ్రీ కరుణాకరరెడ్డి
తిరుమల 21 జనవరి 2023: అయోధ్యలో జనవరి 22వ తేదీ ( రేపు) జరగనున్న రామమందిర ప్రారంభోత్సవం లో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు.
ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామ నామం , నామాలతో సాంప్రదాయ బద్దంగా అయోధ్య శ్రీ రామమందిరం వద్దకు చేరుకున్న శ్రీ కరుణాకరరెడ్డి రామమందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కరుణాకరరెడ్డి రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామమందిర ప్రారంభ సంబరం లో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష లడ్డూలను చైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి అయోధ్యకు చేరుకున్న కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయం భువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామమందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి, ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చైర్మన్ ప్రార్థించారు. రామాలయం భక్తజనంతో విరాజిల్లాలని శ్రీ కరుణాకరరెడ్డి ఆకాంక్షించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది