DEVOTEES LAUD FLORAL DECORATIONS OF BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణలకు భక్తుల నుండి విశేష ప్రశంసలు
TTD PLANS AI-ASSISTANT DEVELOPMENT OF GARDENS IN TIRUMALA
Tirumala, 18 October 2026: Devotees have highly appreciated the floral decorations arranged in Tirumala in connection with the Srivari Brahmotsavams, said TTD Garden Deputy Director Sri Srinivasulu.
He was speaking at a media conference held at the Media Centre in Rambageecha-2, Tirumala, on Sunday.
He said that around 30 donors came forward to support the floral decorations for the Brahmotsavams.
With their cooperation, encouragement from senior officials and the dedicated efforts of the Garden Department staff, the floral decorations were arranged in a grand and captivating manner.
Approximately 60 tonnes of flowers, 5 lakh cut flowers and 80,000 seasonal flowers were used for the decorations.
The fruit-and-flower exhibition arranged at the Kalyana Vedika, 24 concept-based floral displays were created to kindle children’s interest in the Puranas.
He said TTD is contemplating to develop the gardens in Tirumala further with the assistance of Artificial Intelligence in the future.
Tirumala has 34 gardens, of which 20 are being maintained by donors and 14 by TTD. These gardens would be developed and maintained in a more attractive manner with AI-enabled support, he maintained.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణలకు భక్తుల నుండి విశేష ప్రశంసలు
60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం
భవిష్యత్తులో ఏఐ సహకారంతో ఉద్యానవనాల అభివృద్ధి
టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు
తిరుమల, 2026 అక్టోబర్ 17: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణలకు భక్తుల నుండి విశేష ప్రశంసలు వచ్చాయని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలియజేశారు. తిరుమలలోని రామ్ భగీచా-2లోని మీడియా సెంటర్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో పుష్పాలంకరణలు చేపట్టేందుకు దాదాపు 30 మంది దాతలు ముందుకువచ్చారని, వారి సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో తిరుమలలో అత్యంత శోభాయమానంగా పుష్పాలంకరణలు చేపట్టామని చెప్పారు. దాదాపు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల తొలిరోజు, గరుడసేవ రోజు, ఏడో రోజు పుష్పాలంకరణలు మార్చడం జరిగిందని తెలిపారు.
జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్న పిల్లలకు పురాణాలపై ఆసక్తి కలిగేలా 24 రకాల కాన్సెప్ట్ లతో పుష్పాలంకరణలు చేపట్టినట్లు తెలియజేశారు.
భవిష్యత్తులో ఏఐ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాల అభివృద్ధి
భవిష్యత్తులో ఏఐ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. తిరుమలలో 34 ఉద్యానవనాలు ఉన్నాయనీ, 20 ఉద్యానవనాలను దాతలు నిర్వహిస్తుండగా, 14 ఉద్యానవానాలను టీటీడీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉద్యానవనాలను నిర్వహణలో ఏఐ భాగస్వామ్యంతో మరింత అందంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పీఆర్వో కుమారి నీలిమ, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం, పాల్గొన్నారు.


