NARTANA KRISHNA MUSES _ చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

TIRUMALA, 18 OCTOBER 2026: On the pleasant evening of Sunday devotees had experienced a chill thrill with the divine glimpse of Sri Malayappa Swamy as Nartana Krishna on the soothing Chandraprabha Vahanam.

Decked in white floral garland, the utsava deity blessed His devotees along four mada streets.

Both the Pontiffs of Tirumala, EO Sri Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Dr Sharath, Sri Prabhala Gopinath, CVSO Sri Muralikrishna and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

చంద్రకాంతుల వెలుగుల్లో కనువిందు చేసిన శ్రీవారు

తిరుమల, 2026 అక్టోబరు 18: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.

చంద్రప్రభ వాహనం – శాంతికి, మనోప్రశాంతతకు ప్రతీక

చంద్రుని చల్లని వెన్నెల ప్రకృతికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను అందించినట్లే, చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారి దివ్యమంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పరమశివుని శిరోభూషణంగా చంద్రుడు విరాజిల్లుతుండగా, శ్రీమహావిష్ణువు వాహనంగా చంద్రప్రభ వెలుగొందడం హరిహర తత్త్వ సమన్వయాన్ని స్ఫురింపజేసే విశిష్ట ఆధ్యాత్మిక విశేషం.

నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్యలీలలను స్మరింపజేసింది. చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలామాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహనసేవ తిరుమలలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసింది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.