DEVOTEES OPINION INVITED ON DARSHAN DURING MAHASAMPROSHANAM PERIOD_ మహాసంప్రోక్షణ సమయంలో దర్శనవిధానంపై సూచనలివ్వండి శ్రీవారి భక్తులకు టిటిడి విజ్ఞప్తి

Tirumala, 18 July 2018: The temple management of Tirumala Tirupati Devasthanams has invited the pilgrim devotees across the globe to give their opinions on how to provide darshan to devotees during Mahasamprokshanam from August 11 to 16.

It may be mentioned here that TTD EO Sri Anil Kumar Singhal along with TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav appealed to devotees on Tuesday during a press conference seeking the public opinion on darshan since there will be less than 5hours left out for darshan during Astabandhana Balalaya Mahasamprokshanam in the above said dates.

The pilgrims can give their opinion before the forenoon of July 23 and a final call on darshan will be taken during TTD Trust Board Meeting which is scheduled to take place on July 24.

To express their opinion, pilgrims can contact the following numbers.

Call Centre Nos. 0877-2233333/2277777
Toll Free Nos. 1800425333333/18004254141
Whatsapp No. 9399399399
Mail ID. helpdesk@tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహాసంప్రోక్షణ సమయంలో దర్శనవిధానంపై సూచనలివ్వండి శ్రీవారి భక్తులకు టిటిడి విజ్ఞప్తి

తిరుమల, 2018 జూలై 18: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో అనుసరించాల్సిన దర్శన విధానంపై భక్తులు సూచనలు, సలహాలు ఇవ్వాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో జూలై 17న మంగళవారం టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌తో కలిసి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు భక్తులకు ఏవిధంగా దర్శనం కల్పించాలన్న విషయమై భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపిన విషయం విదితమే.

ఇందుకు సంబంధించి భక్తులు తమ విలువైన సూచనలు, సలహాలను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నంలోపు ఈ కింది నంబర్లకు తెలియజేయాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి కాల్‌ సెంటర్‌ నంబర్లు – 0877-2233333, 2277777.

వాట్సాప్‌ నంబరు – 9399399399

టోల్‌ఫ్రీ నంబర్లు – 18004254141, 1800425333333.

ఇ-మెయిల్‌ – helpdesk@tirumala.org

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.