JEO RELEASES RELIGIOUS RITUAL POSTERS_ తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 18 July 2018: Tirupati JEO Sri P Bhaskar on Wednesday evening released the posters of annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples in Kadapa district.

This took place in his chambers in TTD administrative building in Tirupati.

He said the annual fest in both the taken over temples will be from July 23 ro August 1 with Ankurarpanam on July 22.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూలై 18: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను బుధవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 23 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు నిర్వహిస్తామని, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 23న ధ్వజారోహణం, జూలై 27న గరుడసేవ, జూలై 28న ఆర్జిత కల్యాణోత్సవం, గజ వాహనం, జూలై 29న రథోత్సవం, జూలై 31న ధ్వజావరోహణం, ఆగస్టు 1న పుష్పయాగం జరుగుతాయని వివరించారు. శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 23న ధ్వజారోహణం, జూలై 28న కల్యాణోత్సవం, గజవాహనం, జూలై 30న పార్వేట ఉత్సవం, జూలై 31న ధ్వజావరోహణం, ఆగస్టు 1వ తేదీన పుష్పయాగం జరుగనున్నాయని వివరించారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ ఏఈవో శ్రీ రామరాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.