DEVOTEES THRONG TO WITNESS “ANNALINGA” IN SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా అన్నాభిషేకం
Tirupati, 12 Nov. 19: The unique ritual, Annabhishekam was performed with celestial fervour in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.
As a part of the month long religious homams that are taking place in the Lord Shiva temple at Kapilateertham in Tirupati, the famous ritual of “Annabhisheka Mahotsavam” was observed in connection with the auspicious Karthika Pournami.
The ritual began with Suddhodaka Abhishekam between 11.30am to 12noon which was performed in Ekanta followed by the ceremonious Annabhishekam from 12 noon till 2.30pm. The devotees had the rare darshan of “Anna linga” from 4pm to 6pm.
KARTHIKA DEEPAM
The famous shrine of Lord Shiva shined brightly in illumination of ghee lit lamps on the auspicious occasion. The devotees thronged in large numbers to lit the lamps in the temple premises. The entire temple city reverberated to the chants of “Hara Hara Maha Deva Sambho Shankara”.
Temple DyEO Sri Subramanyam, Suptd Sri Bhupathi, Temple Inspector Sri Reddy Sekhar, Temple Priests and Devotees Took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా అన్నాభిషేకం
నవంబరు 12, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.
అనంతరం సుమారు 400 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చేశారు.
సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, పశుపక్ష్యాది సకల జీవరాశులు సుభిక్షంగా ఉండడానికి ఈ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.