DEVOTEES TO CHERISH RARE VISUAL OF UTSAVA MURTHIES FROM JUNE 19 TO 23_ జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు కవచరహితంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి దర్శనం

Tirumala, 18 June 2018: The devotees of Lord Venkateswara, will have a rare visual of Utsava Murthies from June 19 to 23 in Tirumala, as the processional deities will take part in the rituals without their armour (Kavacham) during these days.

In connection with Jyestabhishekam or Abhidheyaka Abhisheka Utsavam in Tirumala from June 24 to 26, the ritual of removal of Kavacham on Utsavarulu will take place on June 19. Usually, the armour of the deities will be removed five days prior to this three-day annual fete.

After the second bell on Tuesday in Srivari temple, the Utsava Murthies of Lord Sri Malayappa Swamy, Goddesses Sridevi and Bhudevi will be brought to the Ranganayakula Mandapam. The Swarna Kavacham adorned to the deities will be removed. With the removal of Kavacham, the processional deities bless the devotees during Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam, Sahasra Deepalankara Seva without Kavacham till June 23.

On the first day of Jyestabhishekam on June 24, after Snapana Tirumanjanam, Sri Malayappa Swamy cheers the devotees in Vajra Kavacham, followed by Muttangi Kavacham on June 25 and in Swarna Kavacham on June 26. This Golden Armour remains on the processional deities till Abhideyaka Abhishekam next year.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు కవచరహితంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి దర్శనం

జూన్‌ 18, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు కవచరహితంగా దర్శనమిస్తారు. జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనున్న విషయం విదితమే.

జూన్‌ 19వ తేదీ మంగళవారం రెండో గంట తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బంగారు కవచాన్ని తొలగిస్తారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు కవచరహితంగా సేవల్లో దర్శనమిస్తారు.

జ్యేష్టాభిషేకంలో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచం, రెండో రోజు ముత్యాలకవచం, మూడో రోజు తిరిగి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. అప్పటినుండి సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు బంగారు కవచంతోనే ఉంటారు.

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్‌ 24న వసంతోత్సవం, జూన్‌ 25న విశేషపూజ, వసంతోత్సవం, చివరిరోజైన జూన్‌ 26న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.