DEVOTEES WITNESS GRANDEUR OF SIVA PARVATHI WEDDING CEREMONY_ వైభ‌వంగా శ్రీ కామాక్షి అమ్మ‌వారు, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణం

Tirupati, 14 February 2018: The temple of Sri Kapileswara Swamy was swarmed by hundreds of devotees on wednesday evening to witness the celestial wedding of Goddess Parvathi Devi and Lord Shiva.

The Adi Dampati here in this temple are popular by name Sri Kamakshi Devi and Sri Kapileswara Swamy.

ASWA VAHANAM

On wednesday night Lord Kapileswara swamy took celestial ride on Aswa Vahanam with which vahana seva culminated during Sri KT bramhotsavams.


ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభ‌వంగా శ్రీ కామాక్షి అమ్మ‌వారు, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణం

తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం సాయంత్రం 5 గంటలకు శ్రీ కామాక్షి అమ్మ‌వారు, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రిగింది. అర్చ‌కుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌లు, మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ స్వామివారి క‌ల్యాణం వేడుక‌గా నిర్వ‌హించారు. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసి క‌ల్యాణ‌ఘ‌ట్టాన్ని తిల‌కించారు.

అశ్వ‌వాహ‌నంపై శ్రీ సోమ‌స్కంద‌మూర్తి

ఫిబ్రవరి 14, తిరుపతి, 2018: తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.