ANNAMAIAH CDs RELEASED_ ‘అన్నమయ్య బాలగానలహరి’ సంకీర్తనలు ఆవిష్కరణ

Tirupati, 14 February 2018: Annamaiah Balagana Lahari CD released in Tirupati on Wednesday evening.

In connection with Sravana nakshatram these CDs were released by Spl.Gr.DyEO Sri Muniratnam Reddy.

Music was composed by Sri Rachari and songs rendered by child artistes Pranuti, Sveta, Jayram.


ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

‘అన్నమయ్య బాలగానలహరి’ సంకీర్తనలు ఆవిష్కరణ

ఫిబ్రవరి 14, తిరుపతి, 2018: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య బాలగానలహరి–3, 4, 5” సిడిల్లోని సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఈ కీర్తనలను శ్రీ కె.రామాచారి స్వరపరచగా జయరాం, శ్వేత, ప్రణతి అనే బాల కళాకారులు ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు. ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.