DEVOTIONAL AMBIENCE TO TTD ADMIN BLDGS, SAYS TTD EO _ ఉద్యోగులకు సౌకర్యవంతంగా వర్క్‌స్టేషన్లు
Tirupati, 29 July 2021: TTD Executive Officer, Dr KS Jawahar Reddy has called for enhancing the devotional ambience of the TTD administrative buildings besides provision of comfortable workstations for all TTD employees.
Addressing a review meeting of senior officials and Dr Srinivasa Rao, Asia-pacific CEO of Weston Global Workplaces Services, the TTD EO asked officials to redesign workstations of all 80 departments in the TTD administrative buildings to enhance their productivity and peaceful environment.
Officials informed the EO that civil works were completed in 23 sectors, progressing in 13 and to be taken up in 44 others and in all 1200 work stations shall be installed.
The EO also advised that the external ambience of the TTD administrative buildings also be redesigned in the Temple architecture. The Weston group shall donate all workstations in the task of modernising the Admin buildings.
TTD FA&CAO Sri O Balaji, CE Sri Nageswara Rao and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఉద్యోగులకు సౌకర్యవంతంగా వర్క్‌స్టేషన్లు
పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక శోభ
– టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుపతి, 2021 జులై 29: టిటిడి అధికారులు, ఉద్యోగులు మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యవంతంగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, పరిపాలనా భవనానికి ఆధ్యాత్మికశోభ కల్పించాలని ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గురువారం బెంగళూరుకు చెందిన వెస్టైన్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఆసియా పసిఫిక్ సిఈవో డా. శ్రీనివాస్ రావు, ఇతర టిటిడి అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు పనిచేసే కార్యాలయ పరిసరాలు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాలన్నారు. కార్యాలయాలు చక్కటి అనుభూతిని ఇచ్చేలా వర్క్ స్టేషన్ల డిజైన్లు చేపట్టాలన్నారు. సివిల్ పనులకు సంబంధించి పరిపాలనా భవనంలోని మొత్తం 80 కార్యాలయాల్లో 23 పూర్తయ్యాయని, 13 కార్యాలయాల పనులు జరుగుతున్నాయని, 44 కార్యాలయాల పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. 80 కార్యాలయాలకు గాను 1200 వర్క్ స్టేషన్లు అవసరమవుతాయన్నారు. భవనం బాహ్య పరిసరాలను టెంపుల్ ఆర్కిటెక్చర్ తరహాలో తీర్చిదిద్దాలని సూచించారు. ప్రవేశ ప్రాంతం, వరండాలు, ఖాళీ ప్రదేశాల్లో మొదటగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, వెస్టైన్ సంస్థ విరాళ ప్రాతిపదికన కార్యాలయాల్లో వర్క్‌స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది.
ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.