NEW BLOCK AT SVIMS FOR AROGYASRI PATIENTS- TTD EO _ స్విమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ ఏర్పాటు

–       CASHLESS TREATMENT HEALTH INSURANCE PATIENTS

 Tirupati, 29 July 2021:TTD Executive Officer Dr KS Jawahar Reddy said directed officials to organise a new block at SVIMs hospital for treatment to Arogyasree patients and also to facilitate cashless treatment to all health insurance patients on the lines of corporate hospitals.

Addressing a review meeting with SVIMs officials at his chambers in TTD administrative building on Thursday the TTD EO said henceforth all patients with health insurance will be provided cashless treatment at SVIMs on lines of corporate hospitals.

He directed IT officials to speed up HR management and Hospital management applications and engineering officials to complete all civil works on a war footing.

He instructed officials to improvise Apps for online dispatch of all medical test and scanning reports like X-ray, MRI etc. on the Radiology Imaging System (PACS) to doctors. Greenery be promoted in the surroundings of all hospitals to provide healthy environments to patients, he said while reviewing the Arogya Sree services at TTD hospitals.

He also advised IT, officials, to design Students Software to the database all information about students of TTD Educational institutions

SVIMs director Dr Vengamma, superintendent Dr R Ram, CE Sri Nageswara Rao, FA&CAO Sri O Balaji, CAO Sri Ravi Prasad, IT head Sri Sesha Reddy, SVIMs IT manager Smt Bhavana were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్విమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ ఏర్పాటు

హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన పేషంట్ల‌కు క్యాష్‌లెస్ వైద్యసేవ‌లు

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి

తిరుపతి, 2021 జూలై 29: తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ పేషంట్ల‌కు నూత‌న బ్లాక్ నిర్మించి రోగుల‌కు మ‌రింత మెరుగైన సౌర్యాలు క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని చాంబ‌ర్‌లో గురువారం స్విమ్స్‌, టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్విమ్స్‌లో కార్పొరేట్ ఆసుప‌త్రుల త‌ర‌హాలో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన పేషంట్ల‌కు క్యాష్‌లెస్ వైద్య సేవ‌లు అందించాల‌న్నారు. రోగుల‌కు వేగ‌వంత‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి మ‌రింత విస్తృతంగా ఐటి సేవ‌లు వినియోగించుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లినేషన్లు రూపొందించాలని కోరారు.

ఆసుప‌త్రిలో రేడియాల‌జీ ఇమేజింగ్ సిస్ట‌మ్ (పిఏసిఎస్‌) ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్ట‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో పంపేవిధంగా నూత‌న సాప్ట్‌వేర్ రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించి టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల వివ‌రాలు పొందుప‌ర్చాల‌న్నారు. రోగుల‌కు అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం పెంపొందించేందుకు ఆసుప‌త్రి అవ‌ర‌ణంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్దపీట వేస్తూ, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ వైద్యసేవలపై ఈఓ సమీక్షించారు.

స్విమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌, సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, స్విమ్స్ ఐటి మేనేజ‌ర్ శ్రీ‌మ‌తి భావ‌న ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.