DEVOTIONAL AND MUSICAL PROGRAMMES ENCHANT DEVOTEES DURING BRAHMOTSAVAMS _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
Tirumala, September 18, 2026 ; Vedic messages, devotional music, Annamacharya Keerthanas, Kuchipudi and Harikatha mark the celebrations
A variety of devotional and musical programmes organised by TTD Hindu Dharma Projects at the Nada Neerajanam and Asthana Mandapam on Friday, the fourth day of the Srivari Salakatla Brahmotsavams, attracted devotees.
At Nada Neerajanam, Mangala Dhwani and a Vedic message were presented in the morning, followed by a Kuchipudi dance performance in the evening.
At Asthana Mandapam, programmes including Vishnu Sahasranama Parayanam, devotional music, spiritual messages, Annamacharya Keerthanas and Harikatha immersed devotees in a spiritual atmosphere.
The programmes organised during the Brahmotsavams promote devotion and highlight the glory of Sanatana Dharma.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2026 సెప్టెంబరు 18 ; వేద సందేశం.. భక్తి సంగీతం.. అన్నమయ్య సంకీర్తనలు.. కూచిపూడి, హరికథతో ఆధ్యాత్మిక సందడి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం తిరుమలలోని నాదనీరాజనం, ఆస్థాన మండపాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నాదనీరాజనం వేదికపై ఉదయం మంగళధ్వని, వేద సందేశం, సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించాయి.
ఆస్థాన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, భక్తి సందేశం, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంపొందిస్తూ, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెబుతున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






