DEVOTIONAL FIESTA AT VONTIMITTA _ ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు

VONTIMITTA, 02 APRIL 2023: Sunday witnessed a great gala of devotional programmes organised by TTD at Vontimitta, as part of ongoing annual fete.

 

Smt Leelavati, Smt Ramadevi, Smt Subbu lakshmi rendered melodious keertans on the occasion followed by religious discourse and Harikatha.

 

Earlier the day started with Mangaladhwani.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు

ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 02: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీమతి పి.లీలావతి, జె.రమాదేవి, ఎల్.సుబ్బలక్ష్మి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి. వీటిలో ‘చూడరమ్మ సతులారా…’, ‘పిడికిటతలంబ్రాలు…’, ‘చక్కని తల్లికి ఛాంగుభళా…’, ‘పలుకే బంగారమాయేనా….’ తదితర కీర్తనలు ఉన్నాయి.

ముందుగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత శ్రీ రవీంద్ర శర్మ ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి శ్రీ రమేష్ హరికథాగానం చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.