DEVOTIONAL FIESTA FOR DEVOTEES _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
TIRUPATI, 28 SEPTEMBER 2022: The series of devotional programs organized by TTD on the occasion of nine-day bramhotsavams at its various venues in Tirupati had allured the music lovers in Bhakti Sangeeta and Nritya Vaibhava.
In Mahati, the Annamacharya Sankeertans rendered by Astana Vidhwan Dr. Balakrishna Prasad, and Smt Bullemma immersed the audience in devotional waves.
While at Annamacharya Kalamandiram, the Bhakti Sangeeta program by Smt Visalakshi, at Ramachandra Pushkarini by Sri Ganesh Kumar also attracted devotees.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
తిరుపతి, 2022 సెప్టెంబరు 28 ;తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ భక్తి సంగీతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అన్నమయ్య కీర్తనలను రసరమ్యంగా గానం చేశారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి కె.విశాలాక్షి పలు భక్తి సంకీర్తనలు చక్కగా ఆలపించారు. అదేవిధంగా, రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెదతాడేపల్లికి చెందిన శ్రీ గణేష్‌కుమార్ భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.