DEVOTIONAL PANACEA AT TIRUMALA_ అలరించిన శ్రీ పద్మకుమార్‌ నామసంకీర్తన

Tirumala, 29 September 2017: Besides the direct darshan of Lord and His Vahana sevas during the ongoing annual Brahmotsavams, the TTD has rolled out a bouquet of devotional panacea for milling devotees who thronged the temple town for the grand religious ceremony.

The two platforms for presenting devotional programs- Asthana Mantapam and the Nada Niranjanam-were agog with performances by talented singers,dancers and artists of folk dance and music.

On the seventh day at Nada Niranjanam platform, Smt Srinidhi troupe presented Annamaiah Vinnapalu (group sankeertans).

Later the Nama sankeertans were performed by K Padma Kumar troupe of Kerala followed the excellent rendition by Dr Dwaram V J Lakshmi.

In the evening the versatile female Harikatha performer Smt Jandhyala Krishna Kumari of Annamachaya project left the audience spell bound with her Harikatha Parayanam.

Similarly at the Asthana Mantapam, the artists of SV Music and Dance College presented bhakti sangeet program comprising sankeertans of Annamacharya and mused the devotees.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

అలరించిన శ్రీ పద్మకుమార్‌ నామసంకీర్తన

తిరుమల, 29 సెప్టెంబరు 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై కేరళకు చెందిన శ్రీ పద్మకుమార్‌ నామసంకీర్తన భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శ్రీవారిపై శ్రీత్యాగరాజస్వామి, అన్నమయ్య రచించిన సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మ కడిగిన పాదము….ముఖారి రాగం”, ”గోవిందాశ్రిత గోకులబృందా పావన జయజయ పరమానందా….బహుదారి రాగం”, ”ముద్దుగారే యశోద ముంగిట ముతైము వీడు….కురంజి రాగం” లో అలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అంతకుముందు ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు వి.హరిబాబు మరియు ఎ.శరత్‌బాబు బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులచే చతుర్వేద పారాయణం, ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎస్‌. సుశీలమ్మ బృందంచే విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి ధార్మికోన్యాసం జరిగాయి.

సాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు డా|| ద్వారం వి.జె.లక్ష్మీ బృందం ఊంజలసేవలో అన్నమయ్య సంకీర్తనలు అలపించారు. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి హరికథ గానం చేయనున్నారు.

అదేవిధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు టిటిడి ఎస్‌వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ కె.సుధాకర్‌ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.