CVSO REVIEWS PREPARATIONS FOR RATHOTSAVAM AND CHAKRASNANAM_ రథోత్సవం, చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె. రవికృష్ణ

Tirumala, 29 September 2017: The CVSO Sri Ake Ravikrishna today directed the Vigilance officials to be well prepared for the criticial events of Rathotsavam and Chakrasnanam in the last two days of the ongoing Brahmotsavam-2017

Along with VGO’s Sri Ravindra Reddy and Smt Sadalakshmi, the CVSO asked officials of vigilance to ensure during the Rathotsavam that children and aged people did not cross the ratham and make attempts to pull it as they might get hurt. Similarly he urged them to coordinate with police to take all precautions for safety of devotees during the chakrasnanam and safeguard all elders and women against stampedes.

He had also inspected the key spots of Rathotsavam and Swami Pushkarini to identify critical areas and arrange for cordoning off crowds and make sure safety measures.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

రథోత్సవం, చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె. రవికృష్ణ

తిరుమల, 29 సెప్టెంబరు 2017: శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబరు 30వ తేదీ శనివారం ఉదయం స్వామివారి రథోత్సవం, ఆక్టోబరు 1వ తేదీ ఆదివారం చక్రస్నానానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రాంభగీచ విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం విజిలెన్స్‌ అధికారులతో సమీక్ష సమావేసం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి గరుడవాహనసేవను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన విజిలెన్స్‌ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి రథోత్సవం, చక్రస్నానానికి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు రథం లాగేటపుడు భద్రత సిబ్బంది తీసుకోవలసిన ఏర్పాట్లు వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దూరంగా వుండే విధంగా జాగ్రత తీసుకోవాలని సూచించారు. చక్రస్నానికి మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

ఈకార్యక్రమంలో విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, ఎవిఎస్‌వోలు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.