DWAJASTHAMBA PRATISTHAPANA MAHOTSAVAM AT SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE IN DEVUNI KADAPA_ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

Tirupati, 25 November 2017: The sacred event of Pwajasthambha Pratisthapana Mahotsavam at the TTD sub temple of Sri Lakshmi Venkateswara Temple in Devuni Kadapa of YSR Kadapa district was grandly performed on Saturday morning.

The events of Ankurarpanam, Chatustanarchana, Adhivasamulu and Kalvahanas were performed in the last three days as part of the Mahotsavam.

Other holy rituals of Punyahavachanam, Dwadasaradana, Laksharadhana,Nitya Homam, Pranapratistha Homam ,Parihara homam, Shanti Homam, Purnahuti etc were performed ahead of Kalashaprokshana, Prana Pratista, Naivaidyam, Mangala harati, Sattumora etc .

The devotees were enthralled with conduction of sacred rituals and later partook prasadam distributed by the TTD.

Among others the TTD local temples DyEO Sri Lakshman Nayak, Superintendent Sri Nagaraja, Temple Inspector Sri Easwar Reddy and others also participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

తిరుపతి, 2017 నవంబరు 25: టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఆలయంలో నవంబరు 22న అంకురార్పణ, నవంబరు 23న చతుష్టానార్చన, నవంబరు 24న అధివశములు, కాలవాహనలు చేపట్టారు.

ధ్వజస్తంభ ప్రతిష్టలో భాగంగా పుణ్యహవచనం, ద్వాదశారాధన, లశారాధన, నిత్యహోమం, ప్రాణప్రతిష్ట హోమం, పంచసూక్త హోమం, పరిహార హోమం, శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కలశప్రోక్షణ, ప్రాణప్రతిష్ట, నైవేద్యం, మంగళహారతి, సాత్తుమొర చేపట్టారు. ఆ తరువాత భక్తలకు ప్రసాద వినియోగం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ లక్ష్మణ్‌నాయక్‌, సూపరింటెండెంట్‌ శ్రీ నాగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ఈశ్వర్‌రెడ్డి ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.