TTD CHAIRMAN UNVEILS WORKS AT DEVUNI KADAPA_ దేవునికడపలో కల్యాణమండపం, చౌల్ట్రీని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
Kadapa, 28 February 2019: TTD chairman Sri Putta Sudhakar Yadav today inaugurated a TTD Kalyana Mantapam, and a choultry at TTD sub temple of Sri Lakshmi Narasimha swamy in Devini Kadapa for benefit of devotees. The TTD chairman performed special pujas etc. At the new buildings. .
He said the kalyana mandapam spread over 4066 sq.feet and the Choultry over 4044 sq. feet cost Rs.4.5 crore. The choultry comprised of 2 dormitories and 21 rooms.
Later the Chairman also participated in the ground breaking ceremony of Rs.4.20 crore worth works for Gopuram, Dwajasthambham, balipeetham, prakaram, nava graha mandapam and two arches.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
దేవునికడపలో కల్యాణమండపం, చౌల్ట్రీని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
ఫిబ్రవరి 28, కడప, 2019: కడప నగరంలోని దేవునికడపలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద టిటిడి కల్యాణమండపం, యాత్రికుల వసతి సముదాయాన్ని(చౌల్ట్రీ) గురువారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కాగా, రూ.4.5 కోట్లతో 4,066 చ.అడుగుల విస్తీర్ణంలో టిటిడి కల్యాణమండపాన్ని, 4,044 చ.అడుగుల విస్తీర్ణంలో చౌల్ట్రీని నిర్మించింది. చౌల్ట్రీలో మూడు ఫ్లోర్లలో 21 గదులు, 2 డార్మిటరీ హాళ్లు ఉన్నాయి.
అనంతరం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సిద్ధయ్యగారి మఠంలో రూ.4.20 కోట్లతో రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రాకారం, నవగ్రహ మండపం, 2 ఆర్చిల నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.