GRANDEUR MARKED ON GARUDA SEVA_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

DEVOTEES TURN OUT IN HUGE NUMBERS

SRINIVASA MANGAPURAM REVERBERATES TO GOVINDA NAMAS

Srinivasa Mangapuram, 28 February 2019: The most important vahanam during the nine day annual festival, Garuda Vahana Seva was observed with utmost pomp and religious gaiety in Srinivasa Mangapuram on the fifth day evening on Thursday.

It was the grand celestial grandeur which sparkled all through Garuda Vahana Seva at the pilgrim centre on the pleasant evening.

Seated majestically on Suparna-the God of aves, the processional deity of Sri Kalyana Venkateswara Swamy was taken all along the streets encircling the shrine. The famous Lakshmi Kasula Haram brought from Tirumala temple for the occasion was also decked to the deity which dazzled in the electrical illumination.

The drum beats, kolatam, chekka bhajana, Pandari Bhajana by various artistes in front of vahanam enhanced the glory of Lord on Garuda Vahana.

The pravachanam by eminent scholars explaining the significance of Garuda Vahanam, vedic hymns by priests, Saxophone and Nadaswaram, added the devotional quotient.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri B Lakshmikantham, CVSO Sri Gopinath Jatti, SE 1 Sri Ramesh Reddy, Temple DyEO Sri Dhananjeyulu and other officers, scores of pilgrims were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2019 ఫిబ్రవరి 28: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ శ్రీవారికి ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఊరేగి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని స్వామివారికి అలంకరించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీవారి ఆలయం నుంచి దాదాపు 3 కిలోల బరువు గల బంగారు ఆభరణాలను స్వామివారికి బ‌హూక‌రించిన‌ట్లు తెలిపారు.

గరుడసేవ సందర్భంగా విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా భక్తులందరికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాలు సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్ఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.