DHANURMASA DARSHANAM IN SRINIVASA MANGAPURAM _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

TIRUPATI, 10 DECEMBER 2022: As the auspicious Dhanurmasam set to commence from the evening of December 16, Dhanurmasa Darshanam will be provided to devotees in Srinivasa Mangapuram temple during the entire month.

Devotees will be allowed for Dhanurmasa Darshanam from December 17 to January 14 (2023) between 5:30am and 6am.

Nitya Kalyanam wi be performed between 11am and 12:30pm. Every day the devotees will be allowed for Darshan between 9:15am and 8am.

Vaikunta Dwara Darshanam for devotees commences from January 2. TTD has also arranged special devotional ptograms on the occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

తిరుపతి, 2022 డిసెంబరు 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆరోజు సాయంత్రం ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు.

ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్య కల్యాణోత్సవం జరుగుతుంది.

ధనుర్మాస శుక్రవారాల్లో తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యం, మూలవర్లకు అభిషేకం, ఉదయం 9.15 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2వ తేదీ తెల్లవారుజాము నుండి భక్తులకు వైకుంఠ ద్వారా సర్వదర్శనం కల్పిస్తారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.